Monday, March 1, 2021

THOLIPREMA

-pradeep devarapally

 విశాలం గా ఉన్న వరండాలో టీచరు క్లాసు కి లేటు అవుతుంది అని వేగంగా నడుచుకుంటూ క్లాసు లోకి వెళ్ళింది . అప్పటికే పిల్లలందరితో  నిండిపోయిన క్లాసు రూమ్ పూర్తిగా ఉడికిన గిన్నెలో అన్నం ఎలా కుత కుత మని శబ్దం చేస్తుందో , అలా పిల్లలందరూ కుయ్ కుయ్ మని ఎవరికి నచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ ఉన్నారు .

క్లాసు లో కి వెళ్ళిన టీచర్ ని చూడగానే అన్నం ఉడికిందని గమనించి పొయ్యి మీద నుండి అన్నం గిన్నె తీసేస్తే సుయ్ మని శబ్దం వచ్చి ఆగిపోతుందో ,అలా టీచర్ ని చూడగానే రేయ్, ఏరా, వసేయ్ అంటూ అల్లరి చేసే పిల్లల అరుపులు ఒక్కసారిగా ఆగిపోయి గుడ్ మార్నింగ్ టీచర్ అని ఆనందంతో కేకలు వేసే పక్షి పిల్లలు లాగా అరిచారు . మొఖం మీద చెమట ను చీర కొంగుతో తుడుచుకుంటూ , సిట్ డౌన్ అంది.

మొదటి రోజు కాబట్టి టీచర్ కూడా కాస్త కంగారు పడుతూ టెక్స్ట్ బుక్ ఓపెన్ చెయ్యడానికి చేతులు సాహసించిన ,కంగారు రెండు చేతులతో టెక్స్ట్ బుక్ ను బోర్ల తిరగ వేసింది. ఇంకా 30 నిమషాలు   చేసేదేది లేక సరే ! ఒక్కొక్కరు లేచి మీ పేరు చెప్పి కూర్చోండి అంది.

ఎవరో పెద్దవాళ్ళు చెప్పినట్టు ఆడవాళ్ళతో మొదలు పెట్టాలని నా పేరు సులోచన అని మొదటి బెంచి లో  నుంచి లేచి పేరు చెప్పి కూర్చుంది . టీచర్ తర్వాత అంటే నా పేరు శ్యామల అంది , తర్వాత అంటే సుమా , వాణి, లక్ష్మి అంటూ .....అమ్మాయిలు అందరు చెప్పారు . తర్వాత అబ్బాయిలు అంటే మొదటి బెంచి లో కూర్చుంటే స్కూల్ ఫస్ట్ వస్తాడంట అని వాళ్ళ తాత చెప్పిన మాటలకి అదే బెంచిలో కూర్చొని మొదటి రోజు అన్ని పుస్తకాలు వీపున వేసుకొని వచ్చి సర్దుకుంటూ  నా పేరు శ్రీను అని చెప్పి కూర్చున్నాడు . తర్వాత అంటే కొత్త బట్టలు వేసుకొని బెంచి మీద కూర్చుంటే ఎక్కడ నలిగి పోతాదేమో అని భయం తో బెంచికి సగం , కాళ్ళను భూమికి ఆనించి బెంచిని సగం వెనకాల వదిలేసి ముందుకు కుర్చున్న వాడు ఒక్కసారిగా లేచి శ్యాము అని కేక పెట్టాడు . మాములుగా వీడి గొంతు చిన్నదిగా ఉంటుంది , కాని బెంచికి సగం ముందుకి కూర్చొని ఒక్కసారిగా లేవడం వలన రెండు మొకాళ్ళు బెంచికి గట్టగా తగిలాయి . అలా మాట కేక వేసింది . టీచర్ తర్వాత అంటే బెంచిలో పక్కనే బ్యాగ్ ఉంది కాని ఎవరు లేరు . ఆ తర్వాత టీచర్ అంటే వేణు టీచర్ , గణేష్ టీచర్ , రాము టీచర్ , .... అని అందరు ఒక్కొకరి తర్వాత ఒకరు గాల్లో ఎగిరే వరుస పక్షుల మాదరిగా చెప్పసాగారు .

ఇలా చెప్తుండగానే 30 నిమిషాల సమయం 03 నిమిషాలకు వచ్చింది . దొంగ తనం చేసిన దొంగలా చెమటలు కక్కుకుంటూ ఆ చెమటను ఎడమ చొక్కాతో తుడుచుకుంటూ , కుడి చేతితో గుడ్ మార్నింగ్ చెప్పి చెప్పనట్టు గా సగం పైకి లేపి గాల్లో ఉంచాడు.   ఈ అవతారంను చూసిన టీచర్ ఏంట్రా ! ఆ బట్టలు అని అడుగుదామని పించినా , గంట మోగేసరికి సరే లోపలి రా , నేను బయటకు వెళ్ళే టైం అయ్యింది అని వెళ్ళిపోయింది.

సూర్యుడు నిట్టనిలువు నుండి 270 కోణం దాటి 300 దగ్గరకి చేరుకుంటున్నాడు . పక్షులు కిల కిల మని తన సొంత గూటికి వెళ్ళే పయనాన్ని ప్రారంబించాయి. టీచర్లు R.T.C బస్సు ఎక్కడ వెళ్లి పోతుందో అని క్లాసులో పాతాల మీద కంటే చుట్టూ వినిపించే శబ్దాల పైన ఎక్కువ ద్యాస పెట్టారు . చివరికి సాయంత్రం గంట మోగింది , ఎవరి గూటికి వాళ్ళు చేరుకున్నారు .

గుమ్మ బయట గేదలకు వేసే గడ్డి పొగ దాని తీవ్రతను తగ్గించి నిశ్శబ్దంగా గా గాలితో ఆడుకుంటున్న సమయం .

రేడియోలో ఆకాశవాణి  ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అని మధ్య గదిలోంచి గుమ్మo బయటకు నెమ్మదిగా వినిపిస్తుంది.

అమ్మా ! ఆకలి అంటూ ఆరుబయట మడత మంచం పై కుర్చుని  (దొంగ తనం చేసిన దొంగలా చెమటలు కక్కుకుంటూ ఆ చెమటను ఎడమ చొక్కాతో తుడుచుకుంటూ , కుడి చేతితో గుడ్ మార్నింగ్ చెప్పిన వాడు ) , పొగ కూడా కనిపించే వెలుగులో బ్యాగ్ లోంచి పుస్తకాలను తీసి అటు ఇటు తిరగేస్తూ ఉన్నాడు . కంచంలో అన్నం పెట్టుకొచ్చిన తల్లి ఏంట్రా ! పొద్దుపోయింది ఇంకా చాలులే ఆ చదువు , పుస్తకాలు ఆ సూరి మీద పెట్ట్టిరా అన్నం పెడతా అంది . అన్నం తినిపించిన అమ్మ కమ్మగా నాలుగు మాటలు చెప్పేసరికి చందమామకే అమ్మ కద చెప్తే ఎలా నిద్రపోతుందో అలా ఆ రాత్రి హాయిగా వెన్నెలలో చెట్ల ఆకులు పాడే జోల పాటలాంటి గాలిని స్పర్శిస్తూ నిద్రపోయాడు .

                  -to be continued Nxt chapter
 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home