Monday, March 1, 2021

THOLIPREMA

 

-pradeep devarapally

కమ్మగా చెప్పిన కధకో , అమ్మ పెట్టిన ముద్దకో గాని కోడి కూసి చాలా సేపయిన ,ఉదయాన్నే సూర్యుడు వెలుగును విస్తరించుకుంటున్నామనోడు మాత్రం కళ్ళు విప్పలేదు. ఇంతకి మనోడి పేరు చెప్పలేదు కదా ! పేరు ప్రకాష్

కళ్ళకి ఎండ తగిలిందో లేక ఇంట్లో నుండి అమ్మ తిట్లు వినబడ్డాయో గాని ఒక్కసారిగా లేచాడు . లేచి లేవగానే రాత్రి అటక మీద పెట్టిన పుస్తకాలను తీసి ఒక వరుసలో  పెట్టి బ్యాగ్ లో పెట్టుకున్నాడు .

గుమ్మ దగ్గర దండెం పై ఆరేసిన తున్దుని తీసుకొని స్నానం చేసి వచ్చే లోగా ఇంట్లో అమ్మ కమ్మగా రాత్రి మిగిలిన  అన్నం ను తిరమాత పెట్టి పులిహోర గా మార్చేసింది . కొంచెం తిని , మిగతాది డబ్బాలో పెట్టుకొని స్కూల్ కి బయలుదేరాడు . అప్పటికే స్కూల్ లో అసెంబ్లీ పూర్తయి , ఎవరి క్లాసు లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు . ఎక్కడ డ్రిల్ మాస్టర్ చూస్తారేమో అని బయంగా పిల్లి లాగ వెళ్లి వాళ్ళలో కలిసిపోయి క్లాసు లోకి వెళ్ళిపోయాడు .

గడియారంలో  గంటల ముళ్ళు తన స్తానాన్ని మార్చుకుoటుoది. టీచర్లు  నీటి గుంటలలో ఎగిరి ఆడుకునే కప్పు పిల్లల్లా పిరియడ్ పిరియడ్ కి క్లాసులు మారుతూ పాటలు చెప్తున్నారు .  ప్రకాష్  టీచర్ చెప్పే పాటలను వింటూనే ఉన్నాడు  కాని చూసే కళ్ళు , పేల్చే ముక్కు మాత్రం ఎంతకి వాళ్ళు చెప్పే పాటాలను మాత్రం స్వాగతించడం లేదు.

ఎందుకా అనుకుంటున్నారా ? ఒక్కసారి నిన్న ఏం జరిగిందో తెలుసుకోవాలి . తెలుగు టీచర్ క్లాసు చెప్తూ చెప్తూ పాటాలను కూడా ఆపేసి , గోడ మీదకి చూసింది . గోడలు బోసిగా ఉండటo చూసి  టీచర్ ఒక పని చేసింది . అది ఏంటంటే క్లాసు లో నాలుగు పక్కల నాలుగు గోడలు ఉన్నాయి. అవి ఒక్కో సబ్జెక్ట్ కు ఒక్కో గోడను కేతాయిoచమని.ఎదురుగా గణితం నకు , రెండు పక్కలా బౌతిక , సామాన్య శాస్త్రాలకు , ఇంకో గోడ తెలుగు సగం , ఇంగ్లీష్ సగం అని చెప్పింది.

ఇంకా తృప్తి చెందకుండా మనకు చదువు బాగా రావాలంటే చదువుల తల్లి క్లాసు గోడపై ఉండాలి . మీరు వేసుకునే చెప్పులు గుమ్మo బయట ఉండాలి అంది . అంటూ అంటూనే ఆ ఫోటో నేను ఇస్తానులే కాని ఆ ఫోటోకి మాత్రం రోజుకో పువ్వు పెట్టండి . ఎవరు పెడితే వాళ్ళకి చదువు బాగా వస్తుంది  అని చెప్పి టీచర్ తర్వాత క్లాస్ కి వెళ్ళిపోయింది .

మరుసటి రోజు చెప్పిన విధంగానే క్లాసు కు వచ్చేటపుడు సరస్వతి దేవి ఫోటో తెచ్చి , ప్రకాష్ చేత గోడకి మేకు కొట్టించి , ఆ మీకుకి తగిలించింది . ఇంతలో పువ్వు టీచర్ అని అమ్మాయిల్లోంచి  సన్నని గొంతు తొంగు చూసింది . దీంతో మా ఇంట్లో గులాబి చెట్టు ఉంది టీచర్ ! నేను తెస్తా అని పరుగుపెట్టాడు . టీచర్ రేపు వచ్చినపుడు  తేద్దువులీరా  అని అనేలోపే  స్కూల్ గేటు దాటేసాడు .

అలా దాటినా వాడు రెండు క్లాసులు అయిపోయిన తర్వాత క్లాసు కొత్త టీచర్ వెళ్ళిపోయే ముందు ప్రత్యక్షమయ్యాడు . ఇది జరిగిన కధ.

ఇక ప్రస్తుతానికి వస్తే నిన్న పెట్టిన పువ్వు ఫోటో పై లేదు అనే కోపం ఒకవైపు, ఆ పువ్వు పరిమళం తన క్లాసు అమ్మాయి జడలలోనే వుందని గ్రహించిన ముక్కు స్వభావం మరోవైపు .

ఇంతలో ఇంగ్లీష్ సర్ పాటం చెప్తూ ఏదో ఇంగ్లీష్ పదం చెప్పి దాని తెలుగు అర్ధాన్ని అడిగాడు .ఒక్కసారిగా అప్పటిదాకా తూడు మద్య కమలం పువ్వులా ఉన్న అమ్మాయి , ఎవరో చేయి వేల్ల మద్యలో పైకి లేచినట్టు లేచించి.

లేస్తూనే ఆలోచించడం సర్ అంది . ఆలోచన అనగానే పువ్వు గురించి ఆలోచించే ప్రకాష్ ఒక్కసారిగా ఉల్లిక్కపడి పువ్వు కోసం వెతికే వాడి  కళ్ళు ఆ అమ్మాయి ముఖం వైపు , ముక్కు తన జడలో ఉన్న పువ్వుల మకరందం వైపు , చెవులు అమ్మాయి చెప్పే మాటలను వింటున్నాయి . రేడియోలో లోని చిత్రలహరి పోగ్రాం లో మంచి పాట  వినేటప్పుడు నాన్న వచ్చి స్టేషన్ మార్చినట్టు , అమ్మాయి ని చూసిన ‘తొలి చూపు’ లో తన మాటలు విన్తున్నోడికి బడ్లో పనిచేసే అప్పన్న వచ్చి ఇంటి బెల్ కొట్టేసాడు .

సూర్యుడు కూడా వెళ్ళిపోయి చందమామని కూడా స్వాగతం చెప్పేసాడు . ఆరుబయట మంచం మీద అమ్మ కమ్మటి కధలు చెప్పి , కలిపిన ముద్దలు నోట్లో పెట్టి కంచం కూడా పక్కన పెట్టేసింది . కాని అమావాస్య రోజున నల్లని ఆకాశం లో  తెల్లని నక్షత్రాలులా , తన నల్లని జుట్టులో ఎర్రటి గులాబినే గుర్తుకు వస్తుది .

రోజు కోడో , సూర్యుడో , అమ్మో లేపోతే గాని లేచావాడు ఉదయాన్నే లేచి పెరట్లో ఉన్న గులాబి చెట్టు పూలను చూస్తూ కూర్చున్నాడు . ఏరా ! బడికి టైం అవుతుంది పోవా అంటే , పోతానమ్మ అంటూ అటు పూర్తిగా గులాబి రంగు కాదు , అలా అని ఎరుపు రంగు కాకుండా ఉన్న ‘గులాబి పువ్వు’ ని రెండు ఆకులు కింద పట్టుకుని తెంపి అమ్మా ఇచ్చిన అన్నం డబ్బా పక్కన బద్రంగా పెట్టి బడికి బయలు దేరాడు 

                                                    
                                                 -
To be continued   

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home