THOLIPREMA
-pradeep devarapally
గోడకి అనుకోని నిద్రపోతున్న సైకెల్ ని సీటు పై ఒక్కటేసి నిద్ర చాలు ఇక పోదాం పద అన్నటుగా సైగ చేసి సైకులేక్కాడు ప్రకాష్ . రోజూ వెళ్ళే దారి అయిన ఈ రోజు ఎంతో కొత్తగా కనిపిస్తుంది . రోజు రుయ్ రుయ్ మని రోదన చేసే ఆటో , బస్సు ల హారన్ లు ఈ రోజు ఆ శబ్దం ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది . పొలం గట్ల మీద పని చేసే అవ్వ తాతల ముచ్చట్ల ముసిముసి నవ్వులు తనని ఊహల్లోక్కి తీసుకుపోయింది.
రైలు గేటు దాటిందే స్కూలు రాదు . గేటు దగ్గర ఎండలో వేచి చూసి ,చూసి చిరాకు వచ్చే సందర్భం ఈ రోజు ఆ రెండు గేటులకు మద్య రైలు బండి , ఆ రైలు బండిలో రెండు కిటికీల మద్య రెండు కళ్ళతో విసిరిన సన్నని చూపు ఏదో గుర్తుచేసేటట్టుగా ఉన్నాయి . ఒక్కసారి సైకిల్ దిగి , బ్యాగ్ లో చెయ్యి పెట్టి గులాబి పువ్వును ఒకసారి తడిమీ చూసి , నేను ఈ లోకం లోనే ఉన్నాను అని మెలుకువతో మరలా సైకెల్ ఎక్కి స్కూల్ గేటు లోని కి వచ్చేసాడు .
రోజూ ఎంతో హడావిడిగా అసెంబ్లీ జరిగే స్కూల్ లోని చిన్న స్టేజి , జాతీయ పతాకం ఇంకా తయారు అవ్వలేదు . ఎంటబ్బ అని అప్పన్న గదిలోనికి ఒక అడుగు వేసి గడియారం వైపు ఒక కన్ను వేసాడు . టైం 8 కావస్తుంది . ఇంకా అసెంబ్లీ కి చాలా నే టైం ఉంది . నేను తొందరగా లేచాన లేక సూర్యుడు తొoదర పడి వీకువ జామునే మేల్కొన్నడా అర్ధం కాలేదు .
సర్లే ఎలాగో వచ్చానులే కదా అని రోజూ ఆడుకునే స్థలానికి వెళ్తే అక్కడా ఒక్కరు కూడా లేరు . అప్పుడనిపించింది సూర్యుడు కాదు తొందర పడ్డది నేను అని .
పక్కనే ఉన్న మంచి నీళ్ళ ట్యాంక్ దగ్గర కొన్ని నీళ్ళు తాగి , బ్యాగ్ లో నుండి గులాబి పువ్వు తీసి దోసిటతో కొన్ని నీళ్ళు గంధం నీళ్ళు జల్లి నట్టు జల్లాడు .
ఏ కవి చెప్పాడో కాని ఈ మాటలు ఒక్కసారి గుర్తుకు వచ్చాయి . బోర్డర్ కి వెళ్ళే సైనికుడిలా , ట్రోఫి గెలవాలనే ఆటగాడిలా కన్న కళలను నిజం చేసుకోవాలనే యువకుడి ఆలోచనలా తన పువ్వు కి పెట్టుకున్న అమ్మాయిని కలవాలనే కోరికలా
ప్రతి ప్రయాణానికి గమ్యం అవసరం , ఆ గమ్యాన్ని చేసుకోవాలనే నా ఈ పయనం ఇలా మొదలైంది.
అల క్లాసు లో బ్యాగ్ పెట్టి బయటకు వద్దామని లోపలికి వెళ్లిన ప్రకాష్ కి పయనం లేకుండా గమ్యం ఎదురుగా వచ్చినట్ట నిపించింది.
క్లాసు బయట ఒక జత చెప్పులు , లోపల రెండు కళ్ళతో అమాయకం గా చూపులు , లోపలికి చేరిన ప్రకాష్ శ్వాస, అప్పటిదాకా గదిలో గాలి ,ఆ అమ్మాయి శ్వాస కు తోడై మూడైనాయి . నాలుగు కోళ్ళు ఉన్న బెంచిని లాక్కుని చేతిలో ఉన్న పువ్వును దేవతకి పెట్టాలని ఎక్కితే , అది ఇటు అటు కిర్ కిర్ మని శబ్దం చేస్తే గబుక్కున ఆ అమ్మాయి లేచి వచ్చి తన చేతిని స్టూల్ పై పెట్టి ఐదవ కోడుగా మారింది.
మరి కొత్త పువ్వు సరస్వతి దేవికి , పాతది ఏం చేద్దామని అటు ,ఇటు చూస్తుండగా ఆరు రుతువుల సాక్షిగా తను చెయ్యి చాచింది .
వెన్నెలలో వడ గండ్ల వానను ఆస్వాదిస్తున్న పిల్లాడిని ఉరుము వచ్చి బయపెట్టినట్టుగా , 7వ తరగతి గదిలో ఎనిమిది బెంచీల ముందర ఇచ్చిన పువ్వును తీసుకొనే లోపే అప్పన్న 09:50 కి వచ్చి 10 నిమషాలలో అసెంబ్లీ అని మొదటి బెల్ కొట్టి గుర్తు చేసాడు .
అప్పటినుండి
సూర్యుడిని వంక చేసుకొని ప్రతి రోజు తోదరాగా మేల్కొన్నత్తుగా లేచి , పెరట్లో గులాబి పువ్వు తెంచి , అమ్మ పెట్టిన అన్నం డబ్బా పక్కనే దాన్ని బ్యాగ్ లో పెట్టి , స్కూల్ లోకి వచ్చి అప్పన్న గదిలో టైం చూసి దాహానికి కొన్ని నీళ్ళు తాగి , మరికొన్ని గందాన్ని జల్లి నట్టు జల్లి , తన ప్రేమని సరస్వతీదేవి సాక్షిగా ప్రతిరోజు తెలియచేస్తున్నాడు . ఒక్కమాట లో చెప్పాలంటే వెంకటేశ్వరస్వామి నిత్య పెళ్ళికొడుకు అయితే ప్రకాష్ మాత్రం నిత్య ప్రేమ వ్యక్తపరుడు .
మరి ఆ తర్వాత ...?
-completed


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home