Wednesday, March 3, 2021

AA NALUGURU


 


-pradeep devarapally

పేద వారికి పైసలు మీద , డబ్బు ఉన్న వారికి ఆస్తుల మీద వ్యామోహం ఉంటుంది . పేదవాడి పైసా పైసా కలిపితే రూపాయి పోగవుతుంది. బియ్యపు గింజా గింజా కలిసి ఉంటే పొయ్య మీద గిన్నెలో ఎసర  అవుతుంది . అడుగు అడుగు కలిసి వేస్తే గాని పొలానికి దారి చూపుతుంది . చదువు కునే పిల్లలకు  అ .ఆ.. ఇ ...ఈ.... లు అన్ని సరైన క్రమం లో కలిపి పలికితే అక్షరాలు అవుతాయి. మనిషి చివరి నిమషాల్లో శ్వాసకు శ్వాస తోడైతే గాని మరో రోజుకు ...?

ఊరికి చివరన ఇల్లు .పిల్లలు తొక్కుడు బిళ్ళ ఆడినపుడు ఎగిరే గంతులకు ఒకటి లోపలి , ఒకటి బయటకి దాగుడు మూతలు ఆడుతున్నట్టు కనిపించే రాళ్ల రోడ్డు . వరుడికి కోపం వస్తే నీళ్ళు ఇవ్వనట్టు ఎండిపోయి  కనిపించే రోడ్డు పక్కన పొలాలు.  ఇంట్లో ముచ్చటగా మూడు జంతువులు , నలుగురు మనుషులు .

రెండు గేదలు , ఒక కోడి .  ఇక ఇంట్లో నేను , నాన్న , అమ్మ ,తమ్ముడు .

పని తప్ప మరో ద్యాస లేని నాన్న , చదువు తప్ప ఇంకో ఆలోచన లేని తమ్ముడు . నాన్నకు పని సాయంగా నేను ,ఇంట్లో మా అందరితో కలిసి ఉండే అమ్మ.

ఇంటికి నాలుగడుగుల దూరంలో మా తాత పోతూపోతూ ఇచ్చిన 50 సెంట్ల పొలం . నాన్న కష్టం తో సంపాదించిన రెండు గేదలు. రెండు తరాలుగా మారకుండా ఉన్న పెంకుల ఇల్లు . ఇది మా ఇంటి బాహ్య స్వరూపం .

మరి గేటు దాటి ఇంటిలోకి తొంగి చూస్తే ... 

 

 

 

 

 

 

 

 

-to be continued ..


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home