Friday, March 5, 2021

RAILU PRAYANAM



 -pradeep devarapally

అప్పటికే పక్క ప్లాట్ ఫాం పై ఇంకో రైలు వచ్చే టట్లు వుంది . కొంత మంది ఈ ట్రైన్ లో నుండి అవతలకి దిగుతున్నారు .త్రివిక్రమ్ సిరివెన్నెల గారి గురించి చెప్పిన స్పీచ్ లో ‘చార్మినార్ ఇరుకు సందుల్లో పోర్షియో కార్ నడిపినట్టు’ అనే మాటలు గుర్తుకొచ్చాయి ఆ గేటు కి అటు ఇటు కూర్చున్న వాళ్లకి .

పిల్లడు పాల కోసం క్యార్ మని కేక పెట్టాడు , అవతల పట్టాలపై రైలు వేణు కూర్చున్న కిటికీ దాటి ప్యుయ్ ... మని శబ్దం తో నిదానంగా ప్రయానికులను దాటుకుంటూ స్టేషన్ పై ఆగుతుంది .

ఈ లోపల లావుపాటి మనిషి ముసలమ్మ తో గొడవ . బస్సు , రైలల్లో గొడవలు చాలా సరదాగా ఉన్న , ఆ గొడవ పడే వ్యక్తి మాత్రం సిగ్గుగా బావించడు. ఎందుకోగాని ఆ సీటు వాళ్లకి రాజ సింహాసనం లాగ , అవతల గొడవ పడే వ్యక్తి మరొక దేశపు సైనికుడిలా భావిస్తాడేమో బహుసా .

ఇది ఇలా ఉండగా ఓ స్త్రీ బాధ మరో లాగ ఉంది . తిరుగు చార్జీలకు సరిపడా చిల్లర పిల్లాడి చేతికిచ్చి , పట్నం లో సరుకులు కొందామని వెళ్తున్న సీత అనే అమ్మాయి చేతిలో 5 వేల రూపాయలు ఉన్న పర్స్ ఉన్నది .మరి ఇదేం సరదానో పక్కలో పిల్లడు పాసు పోసిన పట్టించుకోదేమో వాళ్ళ గొడవలో పడి ఆమె చేతిలో ఉన్న పర్స్ ను పారేసుకుంది .

ఇంతలో ఎవరో ఆ గేటు దగ్గర కూర్చున్నావు కదమ్మా ! ఇప్పటి దాకా అవతలకి ఇవతలకి తిరిగారు గా వాళ్ళల్లో ఎవరి చేతికి తగిలిందేమో పాపం అంటూ నెత్తిన జుట్టు తెల్లగా , పళ్ళు ఊడిపోయిన అవ్వ సన్నగా నిట్టూర్చింది.

అప్పుడే పక్క రైలు దిగి ఈ రైలు లోనికి ఎక్కిన దానిమ్మ కాయలు అమ్మే లావాటి మనిషి నిక్కరు , చొక్కా , నెత్తిన పెద్ద బుట్ట ని నెమ్మదిగా కిందకి దింపుతూ 5  కాయలు 100 అంటూ ఒక్క కేక వేసాడు.

అప్పటి దాక ఉన్న గొడవ రొదన వదిలి , బాధ బారాన్ని విడిచి తియ్యటి దానిమ్మలపై రెండు కళ్ళు వేసారు భోగి లో ఉన్న ప్రయాణికులు .

‘రావాలి 5 కాయలు 100 అయిపోతున్నాయి అంటూ , మేడం 6 కాయలు ఇస్తా అంటూ ఒక కవరు లో పెట్టి ఎదురుగా ఉన్న సీటులో కూర్చున్న ఒకావిడ చేతిలో పెట్టి తినండి మేడం , బాగుంటే డబ్బులివ్వ్వండి లేకుంటే ఊరికే తెసుకోండి  డబ్బులు కూడా వద్దు అంటూ’  చమత్కారం గా వ్యాపార లక్షణం ను చూపించాడు .

ఈ మాటకి దానిమ్మలు అమ్మే  వాడి దగ్గర కవర్లు నిండుతున్నాయి , బుట్ట కాలి అవుతుంది . అప్పటికే నోట్లో నీళ్ళు ఊరుతున్న వేణు అడగకుండా కిటికీ ఊచలను పట్టుకుని వాళ్ళ నాన్న వెంక చూసాడు .

అది అర్ధం చేసుకున్న రమణ బాబు ఇటు రా అంటూ  డబ్బులిచ్చి ఒక కవరను  తీసుకున్నాడు .ఈ హడావిడిలో  రైలు విజయవాడ దాటి కృష్ణా నది బ్రిడ్జి ఫై కి వచ్చింది . అప్పటిదాకా అమ్మ పక్కనే కుర్చుని ఉన్న రాము లేచి నాన్న పక్కకు చేరాడు .

చెవులకు ఇంపుగా వినిపించే ఆ హోరు , చూడడానికి అంధo  గా కనిపించే ఆ నీరు , నది ఒక్కొక్క కిటికీ దాటుకుంటూ పెంచుతున్న జోరు .

కంటికి కనిపించే కనకదుర్గమ్మ  గోపురాన్ని చూసి , కళ్ళను మూసి మనసులో ప్రార్ధించు కున్నాడు రమణ .

నెమ్మదిగా రైలు నదిని దాటుతున్న తీరు , వేణు లో తగ్గుతున్న జోరు , సంచిలో ఉన్న లడ్డు ని తిందామని నోరు తెరిచిన పక్క సీటు లో ఉన్న షావుకారు .

వేగాన్ని తగ్గించిన రైలు విజయవాడ తర్వాత ప్లాట్ ఫాం అయిన కృష్ణా కెనాల్ జంక్షన్ ను చేరించి.ఎప్పటి నుండో అమ్మగారింటికి వెళ్ళాలన్న తీరిక ఇప్పుడు కుదిరింది. అన్నతో స్కూల్ కి వెళ్ళేటపుడు గేటు గగ్గర చూడటం  తప్ప ఎప్పుడు ఎక్కని రైలులో  ప్రయాణించాలనే ‘రైలు ప్రయాణం’ కోరిక నెరవేరింది.


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home