Saturday, March 6, 2021

NANNA KOPAM


 -pradeep devarapally

నా పేరు కిషోర్.వయసు ఒక 12 ఏళ్ళు ఉంటాయిలెండి. ఊరు మండపాక తణుకు  దగ్గర ,గోదావరి జిల్లా అండి.ఇది 12 ఏళ్ళ బుడ్డోడి చరిత్ర అనుకుంటున్నారా ..? ఇది అలంటి కధ కాదులేండి.

నేను 7 వ తరగతి చదువుతున్నాను మా ఊరిలో . క్లాసు లో ఫస్ట్ రాకపోయినా లాస్ట్ మాత్రం రానులేండి.ఎందుకంటె మాది మిడిల్ క్లాసు గా  ,మార్క్స్ కూడా మిడిల్ గానే వస్తుంటాయి. చదువు లో మిడిల్ అయిన గాని ఏదైన పోటిల్లో మాత్రం నేనే ఫస్ట్నండోయ్.అది ఫిజికల్ గా కాదు , ఎలాంటివంటే వ్యాసరచన ,వక్రుత్త్వం ఇలాంటివి అన్న మాట . మా స్కూల్ పెద్ద హై స్కూల్ కాకపోయినా మంచి టీచర్స్ మాత్రం ఉన్నారు .అందరు మగవాళ్ళే మా కర్మకి . కానీ ఈ మద్య చదువు పూర్తి చేసుకొని ఏదో టెంపరరీ గా  అనుకుంటా మా స్కూల్ లో ఒక ముగ్గురు లేడి టీచర్స్ జాయిన్ అయ్యారు .ముగ్గురు కూడా చాల అందంగా ఉన్నారు .వాళ్ళలో పద్మజ అనే టీచర్ అయితే చాల అందంగా ఉంది . కానీ చాలా కోపం నాన్న లాగ .

నాన్నంటే గుర్తుకోచ్చాడండోయ్ మా ఇంట్లో అమ్మా ,నేను ,తమ్ముడు ,నాన్న వుంటాం.అమ్మానాన్న కూడా మెట్రిక్యులేషన్ పాస్ అయిన వాళ్ళు. వాళ్లకి పాస్ అయిన వెంటనే పెళ్లి చేసారు .అప్పటికి వల్ల వయసు 16 ఏళ్ళు వుంటాయి. అమ్మ వాళ్ళది లంకలకోడేరు ,గోదావరి జిల్లా . తింటే తరిగి పోయే ఆస్తులు లేవు కానీ ,కూర్చొని పని చేసి జీతం సంపాదించే చిన్నపాటి గవర్నమెంట్ ఉద్యోగుల కుటుంబం వాళ్ళది . మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తర్వాత పై చదువులు చదివి ఉద్యోగం చెయ్యాలనే కోరిక అమ్మది .ఎలాగయినా చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చెయ్యాలనే సంకల్పం తాతది.

ఇటు నాన్న కుటుంబానికి వస్తే పొద్దున్న లేచామా , పొలానికి వెళ్ళమా  , పని చూసుకొని వచ్చామా అనే కుటుంబం వీళ్ళది. పొద్దునే గేదలకు గడ్డి వేసామా , పాలు తీశామా , పొలానికి ఎరువులు కొట్టామా , ఎకరానికి  ఎన్ని భస్తాలు వచ్చాయి అని లెక్కపెట్టామా అనే ద్యాస తప్ప ఇంకో శ్వాస వుండేది కాదు నాన్నకి .ఒక వంతెన రెండు మార్గాలని కలిపినట్టుగా ఒక పెళ్ళిలో బ్రోకరు అమ్మానాన్నలను కలిపాడు .

ఉష్... నాన్న విషయం లో పడి అసలు సంగతి మర్చిపోయాను . విషయం ఏంటంటే ప్రతి  సంక్రాంతి పండక్కి మా స్కూల్లో ఆటల పోటీలు , నాకు ఎంతగానో నచ్చిన వ్యాసరచన పోటీలు పెడతారు . ఆటల్లో మనం పాల్గొనక పోయిన వ్యాసరచన పోటిల్లో మనం వక్రతుoడుననే ,  వక్రుత్త్వం లో మనం వ్యాసుడనే . ఎప్పుడుఈ పోటీలు పెట్టిన ఏదో ఒక విషయo గూర్చి రాయడం గాని మాట్లాడటం గాని చెప్పేవారు . కాని ఈ సారి వ్యాసరచన పోటిల్లోఎవరకు ఇష్టమయిన దానిమీద వాళ్ళని రాయమని చెప్పి రెండు గంటలు టైం ఇచ్చారు .

ఏం రాద్దాం అని ఆలోచిస్తూనే అరగంట ముగిసిపోయింది . అలా దిక్కులు చూస్తూ ఉండగా కిటికీలోంచి పద్మజ టీచర్ కనిపించింది .ఒక్కసారిగా ఒక నవ్వు విసిరాను , కాని కోపంగా ఒక చూపు చూసింది . ద్రాక్ష పళ్ళు పళ్ళ మద్యలో ఉంచుకొని పళ్ళెం మొత్తం వెతికినట్టు ,ఉదాహరణ  ఇంట్లో ఉంచుకొని ఊరికే అటు ఇటు చూస్తూ సమయం గడపడందేనికి.

వెంటనే మైండ్ లోకి నాన్నని ,బల్లపై పేపరిని , చేతిలోకి పెన్నుని తీసుకొని రాయడం మొదలు పెట్టాను ఇలా ..

నాన్న కోపం

నాన్నకి కోపం చాలా ఎక్కువండి .ఒకసారి ఏం జరిందంటే ...

 -to be continued ..


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home