ఒక రోజెళ్లిపోయింది
(from Amaravathi Kadhalu -ఒక రోజెళ్లిపోయింది )
ఒక రోజు వెళ్ళిపోయింది మరో రోజు వస్తుది వెళ్లి పోయిన రోజు గురించి ఆలోచిస్తే వచ్చిన రోజు కూడా వెళ్ళిపోతుంది
ఇలా వచ్చి వెళ్ళిపోయే రోజుల్లో ఒక రోజున పిచ్చయ గారు వెళ్ళిపోయారు చాలా మంది వేల్ల్లిపోయే ఈ లోకం లో పిచ్చయ గారు వెళ్ళిపోవడం ఓ విశేషం కాదు పైగా ఆయన కవి ,గాయకుడు ఇలాంటి వేవి కాదు. జీవితం లో ఏదైనా సాదించాడన్నా అంటే అది లేదు కాని పరుగెత్తే ప్రవాహంలో అడుగు తెలియకుండా ఈదే చేప పిల్లలా తొణకని సరసుల్లో కదలని అలలా ఆయన కాలానికి తెలియకుండా కలం తో కలిసిపోయి జీవితం అంతా గడిపాడు.
శబ్దాల గురించి అటుంచండి నిశ్శబ్దం లో పరమ నిశ్శబ్ద్ గ కలిసిపోయి ఆయన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒక రోజు గమనిస్తే చాలు
ఉదయం ఆయన వీధి అరుగు మీద రాగానే పిచ్చయ బార్య సీతమ్మ గారు కుంబకోణం చెంబుతో నీళ్ళు, కచ్చిక తాటాకు పెట్టేది, మొహం కడుగి అటు నుండి ఆటే కృష్ణకి బయలుదేరతాడు. చలి ఏది ,వర్షం ఏది అని లేకుండా అంగోస్త్రం నడుం కి బిగించి కృష్ణ లో దూకవలిందే .
గుండె లోతు నీళ్ళల్లో నుంచి సంద్యా వందనం ముగించి , చెంబుతో క్రిశ్నోదకం తెసుకొని గుడికి బయలేదేరేవాడు . దోవలో వీధి అరుగు మీద చిన్న పిల్లలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే చల్లని కృష్ణ నీళ్ళు వాళ్ళ మీద చిలకరించేవాడు .
వాళ్ళు చలి చలి అని ముడుచుకు పోతుంటే నడుచుకుంటూ ముందుకు సాగేవాడు .రెండో ప్రాకారం లోని గన్నేరు చెట్టు దగ్గరకి వచ్చి , పూలు కోసుకుంటూ ఇక్కడ నిన్న రెండు మొగ్గలుoడాలే అనుకునే వాడు .
ఆయనకీ కొమ్మలు , రెమ్మలు , పువ్వులు అన్ని లెక్కే . పున్నాగ పూలు నాలుగు చెంబులో వేసుకొని మారేడు చెట్ల ఆకులు రెండు తెసుకొని మూడో ప్రాకారం ఎక్కేవాడు.
పిచ్చయ్య గారు వచ్చే సమయానికి అర్చకులు అమరేస్వరునికి అభిషేకం చేసి సిద్దంగా ఉండేవారు . స్వయంగా తెచ్చుకున్న క్రిశ్నోధకం తో అభిషేకం చేసుసోని పూలతో పూజ చేసేవాడు .
అది ఏ పూజ పిచ్చయ్య గారి పెదవి కదిలేది కాదు , మంత్రం బయటకి వినిపించేది కాదు . ఆ స్వామికే తెలియాలి . పూజ ముగించుకొని బయటకు వచ్చి గంట మోగించి , పక్కనే సాగిలపడే వారు .
అప్పటికే అక్కడికి చేరుకున్న అభిషేక బ్రాహ్మణులు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు . పెరుగుతున్న ధరల గురించి , ఆవకాయ ఊరగాయ గురించి , ఈ మాటలు సాగుతుంటే అన్ని వింటూ కూర్చునేవారు .మద్యలో ఏ లింగయ్య పిచ్చయ్య గారు అవునంటారా , కాదంటారా అంటే చిరునవ్వు నవ్వేవారు .అంతే గాని పెదవి విప్పేవారు కాదు .
మద్యమద్యన గాలిగోపురంపై వాలుతున్న పావురల్లను లెక్కపెడుతూ ఉండేవారు . అంత మౌనంగా లోకాన్ని తిలకిస్తున్న పిచ్చయ్య గారు ఇంటి కోస్తునే గుమ్మంలోంచి పచ్చడేమిటోయ్ అని పెద్దగా అరిసేవాడు .
-to be continued..


1 Comments:
Patha padhajalaniki
Kottha oopiri
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home