ఒక రోజెళ్లిపోయింది
(From Amaravathi Kadhalu- ఒక రోజెళ్లిపోయింది)
దొడ్లోంచి సీతమ్మ గారు దోసకాయ పచ్చడనో లేక చింత చిగురు పచ్చడనో అంటే కారం జగ్రత్త అనేవారు .పిచ్చయ్య గారికి రోజు నూరిన పచ్చడి వుండాలి . అందులో కారం దివ్యం గా ఉండాలి . లేకపోతె గొప్ప చిరాకు పడేవాడు . భోజనాననంతరం వక్క పలుకు వేసుకొని , పిచ్చయ్య గారు నులక మంచo లో వాలగా సేతమ్మ గారు కాళ్ళ దగ్గరకి చేరి , పాదాలకు ఆముదం రాసేవారు . వక్క పలుకులు నములుతూ నములుతూ నిద్ర పొతే అంతకే ముందే పట్టే మీద తల వాల్చి ఆవిడ కూడా నిద్రపోయేది .
సాయంత్రం పిచ్చయ్య గారు ఊరి చుట్టి వచ్చే వారు . పాండు రంగ స్వామి గుడ్లో ఆచారి గారికి , ఈయనకి సంభాషణ ప్రతి రోజు ఇలాగే ఉండేది . ‘ ఇవాళ ఏం కూర – పొట్లకాయ , పచ్చడో- కొత్తిమీర కారం , ఇవాళ ఎన్ని పూజలు – రెండు , ఏమిన గిట్టిందా ఏదో అని నవ్వేవాడు ఆచారి గారు’ పిచ్చయ్య గారు కూడా నవ్వే వారు . అక్కడ నుండి పెద్ద బజారులో రాముల వారి గుడి మెట్ల మీద కొంత సేపు కూర్చుని అక్కడ పిల్లల గోలీలాట చూసేవాడు .
పిల్లలతో పాటు తను గోలీలను లెక్కపెట్టేవాడు . రేగి కాయల కాలం అయితే ఏ గిద్దేడో కొని తలా ఒక రేగ్గాయ ఇచ్చేవాడు .
సంధ్య వేలకి తిరిగి గుళ్ళో కొచ్చేవాడు . గుళ్ళో పిచ్చయ్య గారి చోటు పిచ్చయ్య గారిదే. అక్కడ కూర్చొని గోపురంలో రామ చిలుకల వైపు , ఊగుతున్న జమ్మి చెట్టు వైపు చూస్తూ ఉండేవాడు .
గుడి తలుపులు వేసే టపుడు ప్రసాదం గా పెట్టిన వడపప్పు తుండు గుడ్డ కొంగున కట్టుకొని ఇంటి కొచ్చేవాడు . రెండు మెతుకులు తిని , అన్ని పప్పు సితమ్మ గారికి పెట్టి , తను ఒక్కో గింజ నములుతూ నిద్రలోకి వెళ్ళిపోయాడు .
అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్య గారు ఒక రోజు తిరిగి లేవ లేదు .
కాళ్ళ కట్ట నుండి లేచిన సీతమ్మ గారు పిచ్చయ్యగారు పొతే గొల్లుమన లేదు . బొట్టు మాత్రం చేరుపుకొని , ఇంత కాలం నా ఎదురుగా ఉండేవారు ఇప్పుడు నా లోనే ఉన్నారు అనుకుంది . పిచ్చయ్య గారు ఏం సాదించలేదు , తగాదాలు తీర్చలేదు , సమస్యలను చర్చించ లేదు . కాని కాలానికి తెలియ కుండా కాలం తో కలిసి పోయి బ్రతికాడు .
అది చాలదా ? చాలడం లేదు చాలా మందికి ..
మాములుగా బ్రతికి చచ్చిపోయిన వాళ్ళే -మహానుబావులు
Completed ..


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home