-pradeep devarapally
ఇంటికి నాలుగడుగుల దూరంలో మా తాత పోతూపోతూ ఇచ్చిన
50 సెంట్ల పొలం . నాన్న కష్టం తో సంపాదించిన రెండు గేదలు. రెండు తరాలుగా మారకుండా
ఉన్న పెంకుల ఇల్లు . ఇది మా ఇంటి బాహ్య స్వరూపం .
మరి గేటు దాటి ఇంటిలోకి తొంగి చూస్తే ...
ఇటుకుల రంగు కనిపించే విధంగా వుండే గోడలు ,
నాపరాల్లకి సందులో చీమలు తిరిగే దారులు . నలుగురికి నాలుగు గదులు కాకపోయినా ,
వుండటానికి ఒక గది వండటానికి ఒక గది .
పైన పెంకులు , కింద నాపరాళ్ళు , మద్యలో తాడు
సహాయం తో కట్టిన అరలు .
గుమ్మo దాటి బయటకు వస్తే తాటాకులతో కట్టిన చిన్న
పాక . దానిలో రెండు గేదలు , పక్కనే కట్టేసిన తాడుని విడిపించుకోవడానికి విశ్వ
ప్రయత్నాలు చేస్తున్న కోడి . ఇవి సుబ్బారావు యొక్క ఇంటి విషయాలు .
ఈ ఇంటికి ఓ ప్రత్యేకత ఉంది . అది ఏంటంటే ఇంట్లో
నలుగురు తప్ప ఐదుగురు వుండటం సుబ్బారావు
కూడా ఎప్పుడు చూడనే లేదు . సుబ్బారావు ఒక్కడే ఏంటి ! వాళ్ళ తాత ముత్తాతల కాలం నాటి
నుండి అది ఆచారమో , దరిద్రమో కొనసాగుతూ వస్తుంది .
మాములుగా కుటుంబం అంటే తోబట్టువులు , తోడు కోడళ్ళు , ఇల్లంతా గంపెడు
పిల్లలు , మామ్మ , తాత అంతా ఉంటె కుటుంబం
అవుతుంది . కాని వీళ్ళ వoశoలో మాత్రం ఒకడు పుడుతున్నాడంటే లేక
కలుస్తున్నారంటే చాలు ఇంకొకరు
మరణిస్తారు .
ఇదేంటి వింత అనుకుంటున్నారా ..?
సుబ్బారావు వాళ్ళ తాత ల కాలం నాటి నుండి కూడా ఈ
దరిద్రం కొనసాగుతుంది. బహుసా అందుకేనేమో మూడు పెంపుడు జంతువులను తప్ప నాల్గోదానిని
పెంచుకోవడం లేదు .
అది 1980 వ సంవత్సరం. జోరు వాన , వేగంగా ఈదురు
గాలులు. భోజనానికి ముందు విస్తరాకులను తడపాల్సిన నీళ్ళు, భారాన్ని
దింపుకునెంతగా పందిరి తాటాకులను
తడుపుతున్నది వాన నీళ్ళు.
పంతులు మంత్రాలతో మారు మ్రోగాల్సిన పెళ్లి మండపం
, తాటాకుల నుండి పడే నీళ్ళ చినుకుల చప్పుడును వింటూ తరించి పోతుంది పెళ్లి మండపం.
ఊళ్ళో పెద్దలందరు చినుకుల సైజు పెద్దదవక ముందే
పెళ్లి మండపంలోకి వచ్చారు . కాని ఈ జోరు వాన వలన గొడుగుల క్రింద , ప్లాస్టిక్
కవరాల క్రింద తలలు దాచుకున్నారు .
వాన వచ్చిన , వరద వచ్చిన కల్యాణం , కక్కు ఆగదంటారు నిజమేనేమో ..
వాన వచ్చిన , వరద వచ్చిన కల్యాణం , కక్కు ఆగదంటారు నిజమేనేమో అనుకున్న
విధంగా కాకపోయిన జరగాల్సిన తంతు విధంగా ఆ రోజు పెళ్లి జరిగిపోయింది.
ఎవరిదనుకుoటున్నారు మన సుబ్బారావుది. సుబ్బారావు , తన బార్య మొఖంలో ఆనందం కాని
వాళ్ళ తాత , మామ్మ మొఖం లో తెలియని ఆందోళన . కారణం కొత్త కోడలు ఇంట్లోకి వస్తే మా
ఇద్దరిలో ఎవరు ఉంటారో, ఎవరో వుండరో అని తెలియక ఇద్దరు మొఖాలు చూసుకుంటున్నారు .
వాన కాస్త వోడులిచ్చింది . భోజనాలు కూడా
ముగిసాయి. అప్పగింతల కార్యక్రమం జరుగుతుంది. పెళ్ళికూతురు తల్లి నుండి అత్త
గారింటికి వెళ్ళడానికి భాదపడుతున్డటం లో అర్ధం ఉంది. కాని వీళ్ళిద్దరూ భాదపడటం లో
అర్ధం లేకుండా పోయింది.
పదహారు రోజుల పండగ ముగిసింది . ఒకరి ఫోటో కి దండ
పడింది. సుబ్బారావు వాళ్ళ అమ్మ అంటే రంగమ్మ అత్త చనిపోయింది.
అమ్మపోయిన దిగులులో సుబ్బారావు పొలాన్ని సరిగా
చూడడం లేదు . పొలానికి కోపం వచ్చిందో ఏమో
40 బస్తాలు పండే భూమి ఈ సారి 25 బస్తాలకే పరిమితం అయ్యింది.
సద్దేన్నాలు తినడం , సర్ది చెప్పుకోవడం ఏదైన మనుషులకు మాత్రమే సాధ్యం కదా!
దిగాలు ఇంకా పెరిగింది, నీరసం వచ్చింది.
జ్వరానికి దారి తీసింది.
సుబ్బారావు వాళ్ళ నాన్న భార్య పోయినప్పటి నుండి
భాధలో ఉండిపోయాడు. కొడుకుతో అప్పుడప్పుడు పొలానికి వెళ్ళే నాన్న పొలం చూపించిన
ప్రతి ఫలాన్ని ఆస్వాదించలేక మంచం ఎక్కాడు . అప్పటినుండి భోజనానికి , స్నానానికి
తప్ప మంచం దిగటం లేదు. అల సంవత్సరం కాలం గడిచింది.
సుబ్బారావు మంచి మందులు వాడి జ్వరాన్ని నయం
చేసుకున్నాడు . వాళ్ళ నాన్న మంచం మీద పడుకొని , పడుకొని నవ్వారుని లూజు
చేసుకున్నాడు.
పొద్దున్న సద్దన్నం తిని , పొలానికి బయలు దేరాడు
సుబ్బారావు . దారిలో రంగడు కనిపించి ‘ ఏంట్రా ! పోయిన సారి పంట తక్కువ పండింది.
అంటగా’ ఊళ్ళో వాళ్ళు ఎవరో చెప్పుకుంటే విన్నాను అన్నాడు .
‘అవును పంటకి పురుగు ఎక్కువ పట్టిందో లేక పురుగుల
మందు పంటకి తక్కువ కొత్తనో తెలియదు’ తక్కువ బస్తాలు పండింది అన్నాడు సుబ్బారావు .
ఈ సారి ఈ ఎరువులను వాడు ఎక్కువ
బస్తాలు పండుతాయి అని తన చేతిలో ఉన్న
ఎరువులు డబ్బాను చూపించి చెప్పాడు .
ఆ పురుగుల మందు ఖరీదు ఎంత , ఎంత దిగుబడి వస్తుందో అని గాల్లో లెక్కలేసుకుంటూ
పొలానికి వెళ్లి , గడ్డి కోసుకొని తిగిరి ఇంటికి వచ్చాడు . అయినా లెక్కలు ఆపలేదు. పెన్ను
పేపరు తీసుకొని లెక్కలేస్తున్నాడు.
కాలం వేగాన్ని పెంచి నడకను పరుగుగా మలుచుకుంది .
పొలo లో వేసిన విత్తనాలు పెరిగిన వయసును
చూపించేలా ఏపుగా ఎదిగాయి. వేగానికి వయసు తోడై సుబ్బారావు కు ఇద్దరు కొడుకులు
పుట్టి , పెరుగుతున్నారు . కాని శాపమో , దరిద్రమో మంచంలో ఉన్న నాన్న రెండవ కొడుకు
పుట్టినప్పుడే మరణించాడు .
మరో సారి తన కుటుంబం “ఆ నలుగురు” గా సాగుతుంది.
-
Completed
-